నీట మునిగిన బస్టాండ్ ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ-చేర్యాల:  గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ పూర్తిగా నీట మునగడంతో గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మంచాల చిరంజీవులు బస్టాండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏనాడు కూడా బస్టాండ్ నీట మునగ లేదని, ఎప్పటికప్పుడు వర్షపు నీటిని బయటికి తరలించే విధంగా చర్యలు తీసుకునే వారమని, ప్రస్తుతం మున్సిపాలిటీ అయిన తర్వాత అధికారులు,ప్రజాప్రతినిధుల అలసత్వంతోని బస్టాండ్ చెరువుగా మారిందని ఆరోపించారు. ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి  చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్త్యాల తార-యాదగిరి, చింతల మల్లేశం,బియ్య రమేష్,ప్రమోద్,కాటం శ్రీను తదితరులు పాల్గొన్నారు.