ఖనిజ వనరుల శాఖ ఛైర్మన్ ను కలిసిన కాంగ్రేస్ నాయకులు

నవతెలంగాణ – ఏర్గట్ల
తెలంగాణ రాష్ట్ర ఖనిజ వనరుల శాఖ ఛైర్మన్ గా నియమితులైన ఈరవత్రి అనిల్ ను ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రేస్ నాయకులు రేండ్ల రమేష్,రొక్కెడ సంజీవ్,జుంగల గణేష్,రేండ్ల రాజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రేస్ పార్టీకి,బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలందించిన ఈరవత్రి అనిల్ కు కీలక పదవి దక్కినందుకు సంతోషంగా ఉందని,ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.