నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గత తొమ్మిది రోజులుగా న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతు చేస్తున్న సమ్మే కు కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడుగు గంగాధర్ మంగళ వారం నాడు సమ్మే శిభిరానికి సందర్శించి సంఘీబావం తెలిపారు. ఈ సంధర్భంగా గంగాధర్ మాట్లాడుతు ఆశాలకు వెట్టిచాకిరి చేయించి వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపండా కల్లబొల్లి మాటలు ప్రభూత్వం చెప్పి నేటికి నేరవేర్చక పోవడం సిగ్గుచేటని, తామ కాంగ్రేస్ పార్టీ సమ్మేకు పూర్తీ స్థాయిలో మద్దతు ఉంటుందని బరోసా ఇచ్చారు . కాంగ్ర్రేస్ నాాయకులు పెద్ద ఎడ్గి సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, మాజీ ఎంపిటిసి ఇఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గోన్నారు.