– ఆ మూడు పార్టీలు ఒక్కటే
– బీజేపీ పదాధికారుల సమావేశంలో కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిస్తే, వాళ్లు మళ్ళీ బీఆర్‌ఎస్‌లోనే చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు ఒకేరకమైన పార్టీలనీ, వాటికి పరస్పర అవగాహన ఉన్నదని చెప్పారు. 2014లో ఏడుగురు, 2018లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారని ఉదహరించారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ, రాచరిక పార్టీలు, అవినీతి ప్రభుత్వాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.