నవతెలంగాణ-మల్హర్‌రావు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు గురువారం ఎంపిపి చింతలపల్లి మలహల్‌రావు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య లతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేని, సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి విస్తతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం పలు శుభకార్యాలయాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,ఇప్ప మొండయ్య, మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు బిర్నేని బాణమ్మ,కొలుగురి స్వప్న,పులిగంటిశారదా, ఉప సర్పంచ్ చెంద్రయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, బొబ్బిలి రాజు గౌడ్, మేనం శ్రీనివాస్, ఇందారపు ప్రభాకర్, రామిడి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.