ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం


నవతెలంగాణ నసురుల్లాబాద్:  కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేసే 6 పథకాలను వెంటనే అమలు చేస్తామని మండల పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి కి మద్దతుగా నస్రుల్లాబాద్ మండలం కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పించారు పేద ప్రజల కష్టాలు తెలిసిన కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి అవకాశామీయాలని వారు కోరారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరుగారింటి పథకాలను ఎన్నికలకు గురిపొందిన వెంటనే అమలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ ఒకసారి హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని అని అన్నారు ప్రజలందరూ సహకరించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ అరిగే సాయిలు, నాయకులు తుమ్ సాయగౌడ్, శివప్రసాద్, యూసుఫ్, శంకర్ నాయక్, శాంతయ్య, గంగారం తదితరులు పాల్గొన్నారు.