చింతలూరు లో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు . గ్రామంలోని ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ఆరు గ్యారెంటీ స్కీం ల గురించి పూర్తిగా వివరిస్తూ  నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతిరెడ్డి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, ముని పల్లి సర్పంచి చిన్న సాయిరెడ్డి, బంగ్లా వసంతరావు,  కాటిపల్లి నర్సారెడ్డి, గన్న శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్, సుంకరి బెంజిమెన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.