నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాదు అర్బన్లో పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిజామాబాదు అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ గురువారం మార్నింగ్ వాకర్స్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని వాకర్స్ ని కోరడం జరిగింది. బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనను చూసి ప్రజలు విరక్తి చెందుతునరాని ఈసారి అర్బన్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మార్నింగ్ వాకర్స్ షబ్బీర్ అలీ కి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు వాకర్స్ అసోసియేషన్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.