కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం సంచలనమైన మేనిఫెస్టో తీసుకురాబోతుంది

నవతెలంగాణ- మద్నూర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ సంచలనమైన మేనిఫెస్టో ముందుకు రాబోతుందని అధికార బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి దళిత బంధు పథకం పేర్లతో ఎమ్మెల్యేలకు కమిషన్లు పొందడం కోసమేనని దళిత బంధు పథకంలో ఎక్కడా ఏ కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేలు కమిషన్లు పొందినట్లు తన దగ్గర పూర్తి సమాచారం ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినప్పటికీ అలాంటి కమిషన్లు పొందిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల కోసం బీసీ బందు మైనార్టీ బందు కొత్తగా తీసుకురావడం మొదట పెట్టిన దళిత బంధు ఏ ఒక్కరికి అందడం లేదని బిసి బందులో కొన్ని కులాలకు మాత్రమే అందిస్తామనడం మిగతా వారికి మొండి చేయి చూపడం రాష్ట్ర ముఖ్యమంత్రి పథకాలు పెడతారు అందరికీ అందే విధంగా అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ గురువారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుక రాబోయే మేనిఫెస్టో గురించి ఆయన వెల్లడించారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే గ్యాస్ సిలిండర్ 500 కి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎకరానికి 15 వేల పెట్టుబడి సహాయం భూమిలేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం ఆసరా పెన్షన్లు నాలుగువేలు ఇస్తాం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొనసాగిస్తాం ఆ పథకాన్ని మరింతగా పెంచుతాం పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అసైన్డ్ మరియు పోడు భూముల లబ్ధిదారులకు అమ్మకపు కొనుగోలుకు అక్కుపత్రం అందజేస్తాం వీటితోపాటు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందిస్తాం మొదట ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తాం ఈ విధమైన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకు రాబోతుందని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు హనుమాన్లు స్వామి, రామ్ పటేల్, సాహెబ్ రావు, ధరాస్ సాయిలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగనాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు గడుగు గంగాధర్ సన్మానించారు.