కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

– కాంగ్రెస్ పార్టీ లో ఇంచేర్ల, జంగాలపల్లి, బంజరుపల్లి గ్రామాలకు చెందిన 60 మంది గీత కార్మికులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ -తాడ్వాయి 
 కాంగ్రెస్ పార్టీ అనుబంధ కల్లు గీత కార్మికుల సంఘం,ములుగు జిల్లా అధ్యక్షులు గా బొడిగే భిక్షపతిగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిమగాని ఆనంద్ గౌడ్ లు ఆధ్వర్యంలో ఇంచర్ల, జంగాలపల్లి, బంజరుపల్లి గ్రామాలకు చెందిన 60 మంది గీత కార్మికులు కార్మిక సంఘం నాయకుడు జనగాం శ్రీను గౌడ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాల ప్రజలు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ లో కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గీత కార్మికుల పాత్ర అమోఘమైందని గీత కార్మికులను పట్టించుకోవడంలేదని అన్నారు. మంది విద్యార్థులు ఆత్మబలిదానమే తెలంగాణ అని, ఇలాంటి మోసకారి ప్రభుత్వానికి ప్రజలు చరమ గీతం పాడాలి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడం కోసం అందరం కాంగ్రెస్ పార్టీ చేరామని, ఈసారి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వేముల సమ్మి రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముశినపెల్లి కుమార్ గౌడ్, కునురి అశోక్ గౌడ్, నల్లెల భరత్ కుమార్, నునేటి శ్యామ్, మవురపు తిరుపతి రెడ్డి, రతన్, రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.