కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..

 – టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
నవ తెలంగాణ-సూర్యాపేట.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.చివ్వేంల మండలం వల్లభాపురం గ్రామం నుండి వార్డు మెంబర్స్ ,గ్రామ శాఖ అధ్యక్షులు బీ.ఆర్.ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మంగళవారం స్థానిక తన  నివాసంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో12 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. బీ ఆర్ ఎస్ అవినీతి, కుటుంబ ఆరాచక పాలనకు విసిగి పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ రవి,తిక్కల ఆంజనేయులు ల ఆధ్వర్యంలో యాట నరహరి,(3వ వార్డు మెంబర్) యాట రామకృష్ణ(బీ.ఆర్.యస్ మాజీ కార్యదర్శి ) శ్రీకాంత్, ఊరడి మస్తాన్, మరిపడిగ సంజీవ(బీ.ఆర్.యస్ యూత్ అధ్యక్షుడు) తదితరులు పార్టీలో చేరారు.