కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

నవతెలంగాణ – నసురుల్లాబాద్
కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కునిపూర్ రాజా రెడ్డి తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకులందరు కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలు బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చందర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ సింగ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందు పటేల్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ అరిగే సాయిలు, మైలారం భాస్కర్ రెడ్డి, శివ ప్రసాద్, తూము సాయగౌడ్, వెంకన్న,గజ్జెల సాయిలు,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బొయుడి లక్ష్మణ్,సంజీవ్ రెడ్డి, తులసి రామ్, భూంరెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.