కాంగ్రెస్‌ పార్టీ రావాలి

– కేసీఆర్‌ పదేండ్ల అహంకారం పోవాలి..
– నన్ను ఓడించడానికి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుండి పైసలు పంపిండు
– పోచంపెల్లి కేటీఆర్‌ బినామీ…
– కుల,మతాల మధ్య చిచ్చులు పెడుతున్న బీఆర్‌ఎస్‌
– కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ – ములుగు
కేసీఆర్‌ పదేండ్ల అహంకారం పోవా లని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావా లని, నన్ను ఓడించడానికి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుండి పైసలు పంపిండని, పోచం పెల్లి ఏ రాజకీయ నేపథ్యం ఉందని రెండు సార్లు ఎమ్మెల్సీ అయిండు డబ్బులతో కాదా అని, పోచంపెల్లి కేటీఆర్‌ బినామీ అని, పోచమ్మ గుడిలో సోచ్చి ఆయన ప్రమాణాలు చేస్తాడా అని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సీతక్క అన్నారు. వెంకటాపూర్‌ మండలంలోని సింగర కుంటపల్లి,పాపయ్య పల్లి, నర్సాపూర్‌ కేశవపూర్‌, నారాయణ గిరి పల్లి, వెళ్తుర్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ పదేండ్ల అహంకారం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గడిచిన 10 ఏండ్ల కేసీఆర్‌ పాలనలో పేద ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ను గోతి తవ్వి పాతి పెట్టడం ఖాయమని అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌ కేసీఆర్‌ బినామీలు తనను ఓడించడానికి వందల కోట్ల రూపాయలు పట్టుకొని ములుగు వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ములుగు నియోజక వర్గంలో ఎన్నడూ లేని విధంగా మద్యం డబ్బులతో ఓట్లు కొందామని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పోచంపెల్లి శ్రీనివాస్‌ రెడ్డికి ఏ రాజకీయ నేపథ్యం ఉందని రెండు సార్లు ఎమ్మెల్సీ అయిండని, డబ్బులతోటి కాదా అని ఒక్కసారి ములుగు ప్రజలు ఆలోచన చెయ్యాలని కోరారు. కేటీఆర్‌, కేసీఆర్‌ బినామీని కాదని నార్కొ టెస్ట్‌ కయిన సిద్దం అంటున్న పోచం పెల్లి పోచమ్మ గుడిలో అయిన సొచ్చి ప్రమాణం చేస్తావా అని అన్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులకు రీతి ఉంటే మద్యం డబ్బులు పంచకుండా ప్రజల్లోకి వెల్లాలని, ఎవ్వరి దమ్ము ఎంటో తెలుస్తుందని అన్నారు. ప్రజల కోసం బాల్యంలోనే అడవి బాట పట్టి ఆయుధాన్ని ఎక్కు పెట్టిట్టు తెలిపారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఉద్యమంలో పని చేసినట్టు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాటం చేసినట్టు చెప్పారు. కెసిఆర్‌, కేటీఆర్‌ బినామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంపించి సిగ్గు లేకుండా మాట్లాడుతు న్నారని విమర్శించారు. తాను ప్రజలను నమ్ముకున్నానని, బీఆర్‌ఎస్‌ వారు డబ్బులను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. చివరికి గెలిచేది ప్రజలేనని అని తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్‌ అంటేనే…. పేదల పార్టీ
కాంగ్రెస్‌ అంటేనే పేదల పార్టీ అని ములుగు నియోజకవర్గంలో సీతక్క సేవలు అద్భుతం అని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె జయపాల్‌ రెడ్డి అన్నారు. మంగళవారం సీతక్క సమక్షంలో అబ్బాపూర్‌ గ్రామ వార్డు మెంబర్‌ గువ్వ రాజు కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి సీతక్క ఆధ్వర్యంలో చేరారు.