బీఆర్ఎస్ పార్టీ లోకి చేరిన  కాంగ్రెస్ పార్టీ సొసైటీ డైరెక్టర్ విజయ లక్ష్మి

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రానికి చెందిన పట్లోళ్ల విజయలక్ష్మి భాస్కర్ రెడ్డి గత సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సొసైటీ డైరెక్టర్  గెలుపొందారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.వీరికి జుక్కల్  శాసన సభ్యులు హన్మంత్ షిండే పార్టీ ఖండువ వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  పార్టీలోకి చేరిన సొసైటీ డైరెక్టర్ విజయలక్ష్మి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని రాష్టంలో  చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలనుఅకర్షితులైపార్టీలోకిచేరమనితెలిపారు.అంతేకాకుండాగతంలో మేము ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న ప్రస్తుతం  బిజెపి ప్రభుత్వం కేంద్రంలోఅధికారంలో ఉన్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన  అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాల్లో ఎక్కడ జరగడం లేదనిమాన  రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ లో చేరాలని నిర్ణయం తీసుకొని ఎంపీపీ ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో పార్టీలో చేరుతున్నామని  బిఆర్ఎస్ పార్టీలో చేరడం అనందంగా ఉందని అన్నారు. అనంతరం  ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  చేస్తున్న అభివృద్ధి పనులకు రాష్ట్రంలో అనేకమంది కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వస్తున్నారని ఎప్పుడు కూడా అభివృద్ధి చేసిన పార్టీలకు కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో చేరడం చాలా సంతోషం ఉందని అన్నారు. గత కొన్ని రోజుల నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డికి 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ ప్రతాప్ రెడ్డి. సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి,సర్పంచ్ తిర్మల్ రెడ్డి, బీఆర్ఎస్ యూత్ మండల్ అధ్యక్షులు చిప్ప రమేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సాయి రెడ్డి, హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్,తదితరులు పాల్గొన్నారు.