కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను అమలు చేస్తం..

– రైతులకు రెండు లక్షల రుణమాఫి చేసి తిరుతం..
– బీఅర్ఎస్ పాలనలో విచ్చల విడిగా అవినితి..
– మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకే ఈ డిక్లరేషన్  లను ప్రజల ముందు పేట్టమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తిరుతమని, గతంలో రుణమాఫీ ఒకే సారి చేసి చుపినమని, బిఅర్ఎస్ పాలనలో విచ్చల విడిగా అవినితి రాజ్యం మేలుతుందని మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.అదివారం ఇందల్ వాయి మండలంలోని మేగ్య నాయక్ తండా లో గడప గడపకి కాంగ్రెస్ పల్లె పల్లెకి భూపతి రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.అంతకు ముందు సెవలల్ అలయంలో ప్రత్యేక పూజలు చేసి, కాంగ్రెస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 500 ల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, వృద్ధులు, వితంతువులకు 4000 పెన్షన్,నెలకు 4000 చొప్పున నిరుద్యోగ భృతి, అమరుల తల్లిదండ్రులకు 25 వెల పెన్షన్ కుటుంబం లో ఒకరికి,ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సహాయం,ఆరోగ్య శ్రీ పథకం లో భాగంగా5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స,వెనుకబడిన వర్గాల విద్యార్థులందరికీ ఫిజు రియింబర్స్ మెంట్,భూమిలేని నిరుపేదలకు 12వేల రూపాయల సాహయం ప్రతి ఏడాది,18 ఏళ్ళు పైబడిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటి,రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు15000 వేల సహాయం, భూమి లేని నిరుపేదలకు సహాయం ప్రతి ఏడాది 12000వేలు,ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడదికే 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం, వరికి గిట్టుబాటు ధర క్వింటాలుకు 2500,పోడు భూమి రైతులకు పట్టల పంపిణీ, ధరణి పి రద్దు చేస్తామని డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని, కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు, ప్రజలు దగా పడ్డారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. కోందరు దోంగలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే పెన్షన్, ఇతరత్రా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారని,అలా చేప్పిన వారికి చెప్పుతో కొట్టాలని వివరించారు.ఒకప్పుడు కారు లేని వారు ఈరోజు కోట్లలో అక్రమ సంపదను కుడా బేట్టుకున్నరని వాపోయారు.అదికారంలోకి వచ్చిన నేడు రాష్ట్రంలో అమలౌతున్న సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.నాడు నేలా కోల్పిన యూనివర్సిటీ, ప్రాజెక్టు లు,ఇతరత్రా వి ఉన్నాయని,తోమ్మిదేళ్ళలో బిఅర్ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదని, ప్రాణహిత చేవెళ్ల ద్వారా 2వందల కోట్లు ఖర్చు పేట్టి ఉంటే ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉండేవి కాదన్నారు.గిరిజన గుడలను నూతన గ్రామ పంచాయతీ లను నేలకోల్పి ఐదేళ్లు గడిచిన ఒక్క గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తూ మరోసారి మోసం చేయడానికి వేస్తున్నారని భూపతి రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ , డిసిసి డెలిగేట్ వెంకటరెడ్డి , ఉపసర్పంచు బైరయ్య,నవీన్ గౌడ్ ,అంబర్ సింగ్,బాబియా నాయక్, మొనియా నాయక్,సరంగ్ నాయక్,గోపాల్ నాయక్, గంగారాం,మోతిరమ్,లారీ గంగారెడ్డి  బాబురావు ,గంగమని ,రాజన్న, తోట ప్రకాష్ ,సాయందర్, శంషుద్దీన్, యాచారం సాయిలు, నర్సయ్య, నారాయణ, వసంతరావు, భూమన్న మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.