బహుజన చైతన్య సభను విజయవంతం చేయడానికి బహుజనులంతా కదిలిరావాలి.

నవతెలంగాణ – డిచ్ పల్లి
బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే బహుజన చైతన్య సభకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలు, గ్రామాల నుండి పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు, బీడీ కార్మికులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంత చేయాలని బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ కళా శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు రోజులలో బహుజన రాజ్య సాధనకై ప్రతి ఒక్కరు భాగం కావాలని రాష్ట్రస్థాయిలో ప్రజల గొంతుకై ప్రతి సమస్యపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వన్ని బలపరుస్తూ ప్రజల మద్దతు పలకాలని కళా శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లికొండ నర్సయ్య, ఉపాధ్యక్షులు సిలుముల గణేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రోళ్ల గంగాధర్, నియోజకవర్గ అధ్యక్షులు పోతే ప్రవీణ్, ఉపాధ్యక్షులు జిన్న సంపత్, ప్రధాన కార్యదర్శి నట అనంత్ , డిచ్పల్లి మండల అధ్యక్షులు డప్పు బాబురావు, ఇందల్వాయి మండల అధ్యక్షులు గుర్రాల ప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ రణవీర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love