నేడు గడపగడపకి కాంగ్రెస్ కార్యక్రమం

నవతెలంగాణ – కంటేశ్వర్
గడప గడపకి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాదు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో, నేడు అనగా 07/06/2023 సాయంత్రం 5 గంటలకు గోల్ హనుమాన్ చౌరస్తా నుండి మొదలు కాబోతుంది అని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు మంగళవారం ప్రకటనలో తెలిపారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, సీనియర్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సీనియర్ నాయకుల తో పాటు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధాల సంఘాలు గడపగడప కి కాంగ్రెస్ కార్యక్రమం లో పాల్గొంటున్నారని తెలియజేశారు.