ఎమ్మెల్యే సురేందర్ కు కాంగ్రెస్ నిరసన సెగ

 నవ తెలంగాణ- రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు జాజాల సురేందర్ కు గురువారం మండలంలోని కన్నాపూర్ రైతు వేదికలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై చేసిన వాక్యాలను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమానికి వెళ్తుండగా కన్నాపూర్ శివారులో, కాంగ్రెస్ నాయకులు కానువైన అడ్డుకొని నిరసన తెలిపారు. అంతకుముందు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, స్థానిక జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డిని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పోసానిపేట సర్పంచ్ గిరి రెడ్డి మహేందర్ రెడ్డితో పట్టు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయగా, రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు తాడువాయి, సదాశివ నగర్ మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు రామారెడ్డి లోని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకొని, తమ నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు విడుదల చేయడంతో, కాంగ్రెస్ నాయకులు శాంతించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… మండలంలో ఎక్కడ 24 గంటలు రైతులకు విద్యుత్ ఇస్తున్నారు? ఎక్కడ డబుల్ బెడ్రూంలో అందించారు? దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ పంపిణీ చేశారని, ఎమ్మెల్యే గారితో చర్చకు వస్తుంటే పోలీసులు అకారణంగా అరెస్టు చేయడం, ఎమ్మెల్యే చాతగానితనానికి నిదర్శనం అన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేసింది రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని ఎమ్మెల్యే సురేందర్ తెలుసుకోవాలని సూచించారు. నీకు రామారెడ్డి గడ్డ నుండే నిరసన ప్రారంభమైందని, నియోజకవర్గంలో ప్రతి చోట నిరసన తప్పదని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తాడువాయి అధ్యక్షులు స్వామి రెడ్డి, సదాశివ నగర్ అధ్యక్షులు సంతోష్ పాటిల్, యూత్ అధ్యక్షులు కోతి లింగారెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, జనగామ రాజిరెడ్డి, నామాల రవి, వెంకటస్వామి, సిద్ధం బైరయ్య, చింతకుంట కిషన్, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.