
నవతెలంగాణ-భిక్కనూర్
వీడీసీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 10 గుంటల భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కబ్జా చేసిన స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1995 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో ప్రతి రేషన్ షాప్ నుండి చక్కర ద్వారా ఒక్క రూపాయి సేకరించి వీడీసీ ద్వారా కొనుగోలు చేసిన భూమిని ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కబ్జా చేసిన వారిపై అధిష్టానానికి వివరాలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు అయినా సరే పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింబాద్రి, సొసైటీ చైర్మన్ భూమయ్య, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, సురేష్, మైపాల్ రెడ్డి, ఆంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.