కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరికృష్ణ
నవతెలంగాణ పెద్దవంగర: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ, గంట్లకుంట సీనియర్ నాయకులు చెరుకు సత్యం, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం వినోద్ గౌడ్ అన్నారు. గురువారం గంట్లకుంట గ్రామంలో చేపట్టిన యూత్ గ్రామ కమిటీ ఎన్నికకు వారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అందించే పథకాలపై ప్రచారం చేస్తూ, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కలిసి సమన్వయంతో పని చేయాలని కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం నూతన గ్రామ యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ అధ్యక్షుడిగా కన్నే సంతోష్, ఉపాధ్యక్షులుగా చింతల రాకేష్, ప్రధాన కార్యదర్శిగా జాటోత్ శ్రీకాంత్ నాయక్, సహాయ కార్యదర్శిగా మల్లెపాక గోపి, సలహాదారుగా రాపోలు ఉమేష్, కోశాధికారిగా గుర్రం దేవరాజ్, ఎన్.ఎస్.యూ.ఐ గ్రామ అధ్యక్షుడిగా అన్నేబోయిన ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా ఉండాడి నరేష్, ప్రధాన కార్యదర్శిగా చెడిపాక ప్రమోద్, యూత్ గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా చెరుకు రాజేష్, ఎన్.ఎస్.యూ.ఐ గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మరాఠీ రాకేష్ ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, కొండ్రాతి శ్రీనాథ్, మండల యూత్ ఉపాధ్యక్షుడు పబ్బతి సంతోష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, గంట్లకుంట వార్డు సభ్యులు ముత్తినేని సోమన్న, కన్నె సతీష్, గులాం జిలాని, ముక్కావల సంతోష్, సాయిని ఉమేష్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.