ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ బృందం

నవతెలంగాణ- ఆర్మూర్:
కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి వినయ్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బృందం పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి స్థానిక ఎమ్మెల్యే చెపుతున్న మాటల్లో వాస్తవం ఎంత ఉందొ అని బుధవారం నిజనిర్ధారణ చేయటం జరిగింది. ఈ సందర్బంగా వినయ్ రెడ్డి ఆస్పత్రిలోని రోగులను, స్టాఫ్ ను, ఆస్పత్రి సూపరిండెంట్ నాగరాజు ని కలిసి వివరాలు సేకరించి మీడియాతొ మాట్లాడుతు ఎమ్మెల్యే గత 9 సంవత్సరాలనుండి చెప్తున్న విధంగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా మార్చాను అని ప్రజలను మోసం చేస్తున్నాడు అని, ఇప్పటి వరకు 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ కాలేదు అని, కనీస వసతులు లేవని అన్నారు, ఆర్మూర్ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా మారితే దానికి అనుగుణంగా 45 మంది డాక్టర్లు ఉండాలి అని కాని ప్రస్తుతం ఉన్నది 15 మంది అని అందులో 12 మంది వేరే ఆసుపత్రిల నుండి డిప్యూటేషన్ పై వచ్చిన వారే అని, స్థాఫ్ నర్సులు, నర్సులు కలిసి 60 కి పైగా ఉండాలి అని కాని ఉన్నది 20 మందే అని, x రే లేదు అని, గర్భిణీలకు స్కానింగ్ కొరకు స్కానింగ్ లేదు అని, ల్యాబ్ అసిస్టెంట్లు, థియేటర్ అసిస్టెంట్లు లేరు అని, బ్లడ్ బ్యాంక్ లేదు అని అన్నారు, ఫార్మసిస్ట్ లు లేరు అని అన్నారు, రోగులను తీసుకెళ్లటానికి వీల్ చైర్లు లేకపోవటం సిగ్గు చేటు అని అన్నారు, ప్రసుతి సేవలు తప్ప మిగతా ఎటువంటి సేవలు ఆపరేషన్లు జరగటం లేదు ఎమర్జెన్సీ అయితె నిజామాబాద్ కి పంపుతున్నారు అని అన్నారు, పట్టణంలో కుక్కల కోతుల బెడద ఎక్కువ ఉంది అవి కాటిస్తే మందులు లేవు అని అని అన్నారు, 24 గంటలు ముఖ్యమంత్రి వెంట ఉండే జీవన్ రెడ్డి ఆసుపత్రికి సదుపాయాలు కల్పించటంలో విఫలం అయ్యాడు అని అన్నారు,ఈ కార్యక్రమంలో నాయకులు పి సి సి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సాయిబాబ గౌడ్, మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, మాజీద్, జిమ్మి రవి, మందుల పోశెట్టి, అబ్దుల్ ఫయీమ్, మీసాల రవి, కర్ణం గంగాధర్, పురుషత్తం,నర్సారెడ్డి, రాజారెడ్డి, గంగాధర్, ఉస్మాన్, బాల కిషన్, మెహబూబ్, పెద్ద పోశెట్టి, పాషా, హబీబ్, వాసీం, ప్రవీణ్, సునీల్, బారి, అలీమ్,బంద ప్రసాద్, అమృత్, భగత్, అభినవ్, భోజందర్, రాజక్, గౌస్, తదితరులు పాల్గొన్నారు..