రాంగ్‌ కాల్‌తో కనెక్ట్‌ అయ్యారు

ఇద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు
రాచకొండ కమిషనర్‌
నవతెలంగాణ-హయత్‌ నగర్‌
ఓ రాంగ్‌ కాల్‌తో 45ఏండ్ల మహిళ, 25 ఏండ్ల యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. మహిళ ఇంట్లో ప్రేమ విషయం తెలియడంతో ఒకరు ఆత్మహత్యకు యత్నించగా.. మరో 2 రోజుల తర్వాత యువకుడి మత దేహం లభ్యం కావడంతో హయత్‌ నగర్‌లో సంచలనం సష్టించిన విషయం తెలిసిందే. గురువారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహన్‌ కేస్‌ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లాకు చెందిన రాజేష్‌(25) బీటెక్‌ పూర్తి చేసి నగరంలో స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. అతనికి హయత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని వినాయక నగర్‌ కాలనీ రోడ్‌ నెంబర్‌ 5 లో నివాసం ఉంటున్న సుజాత వత్తి రీత్యా ప్రభుత్వ టీచర్‌. ఓ రోజు అనుకోకుండా రాజేష్‌ ఫోన్‌కు రాంగ్‌ కాల్‌ రావడంతో వారిద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం సాగింది. గత 24న పురుగుల మందు తాగిన సుజాతను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలియక ఆమె ఇంటి చుట్టూ రోజు తిరుగు తున్నాడు. తన తల్లి ఫోన్‌ చూసి మరుసటి రోజు రాజేష్‌ను సుజాత కొడుకు జయ చంద్ర, అతని స్నేహితులు దండించారని, ఆ మరుసటి రోజు నుండి రాజేష్‌ కనిపించక పోవడంతో గత నెల 29న కుంట్లూర్‌ సమీపంలోని డాక్టర్స్‌ కాలనీలో శవమై కనిపించాడు. తర్వాత అతని మృతదేహం పోస్ట్‌ మార్టంకు సహకరించక పోవడంతో అతని విసర ను ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ కు పంపాక పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. ఆయన వెంట ఎల్బీనగర్‌ జోన్‌ డీసీపీ సాయి శ్రీ వనస్థలి పురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, హయత్‌ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఉన్నారు.