– మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన దుండగులు మల్కీజ్‌గూడలో ఘటన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వరుస చైన్ స్నాచింగ్‌తో మహిళలు అంతా జంక్కుతున్నారు. మొగుల్ల వంపు ఘటన మరువక ముందే సోమవారం మండల పరిధిలోని మల్కీజ్ గూడలో ఓ మహిళ మెడలో నుంచి 3 మూడు తులాల పుస్తెలతాడును దుండగులు ఎత్తుకెళ్లారు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం మల్కీజ్ గూడ గ్రామానికి చెందిన వరికుప్పల జంగమ్మ భర్త రామచంద్ర య్య అనే రైతు వ్యవసాయ పొలంలో బీరప్ప గుడి వెనకాల పశువులను మేపుతున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తు తెలి యని వ్యక్తులు బైక్ పైన వచ్చి పశువుల మేత గురించి ఆ మహిళతో ఆరా తీశారు. ఆమెతో దుండగులు మాటలు కలి పారు. ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తెలతా డును ఎత్తుకెళ్లారు. బాధితురాలు భయాందోళనలతో కేకలు వేయగా గొలుసు దొంగలు తమ దగ్గర ఉన్న బ్యాగును అక్కడే వదిలేసి వెళ్లారు. బాధితురాలు తమ కుటుంబ స భ్యుల సహాయంతో పోలీసులకు సమాచారం అందిం చారు. సంఘటనా స్థలాన్ని మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఇబ్ర హీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావులు కలిసి డాగ్ స్క్వాడ్ తో పరిశీ లించారు. గొలుసు దొంగలు వదిలేసిన బ్యాగులో మారనాయుధాలైన గొడ్డలి, కత్తులు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇది రెండవ గొలుసు దొంగతనం. వరుస గొలుసు దొంగలతో మహిళలంతా భయాందోళన గురవుతున్నారు. గొలుసు దొంగల వ్యవహారం మండలం లో చర్చనీయాంశంగా మారింది. గొలుసు దొంగలు యాచారం పోలీసులకు సవాలుగా మారారు.
గుర్తు తెలియని వ్యక్తులపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి : సీఐ లింగయ్య
వరుస గొలుసు దొంగతనాలు జరుగుతున్న తరుణం లో మహిళలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తులేని వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గొలుసు దొంగలపై మహి ళలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు తమ బంగారాన్ని బయటికి కనబడకుండా చర్యలు తీసుకోవాలి. గొలుసు దొంగలను త్వరలోనే పట్టుకుంటాం.