కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష  ప్రిలిమినరీ కీ విడుదల

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కానిస్టేబుల్‌, తత్సమాన పోస్టులకు నిర్వహించిన తుది రాతపరీక్ష ప్రిలిమినరీ కీ ని విడుదల చేసినట్టు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మెన్‌ వివి శ్రీనివాస్‌రావు ఆదివారం ప్రకటించారు. ఈ కీని తమ అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. అలాగే, ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏదైనా అభ్యంతరాలున్న పక్షంలో అభ్యర్థులు ఈ అధికారిక వెబ్‌సైట్‌లో తమ పాస్‌వర్డ్‌ ఆధారంగా కేటాయించిన స్థలంలో పొందుపర్చాలనీ, 24వ తేదీ వరకు ఈ అవకాశం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలు కూడా సదరు అభ్యర్థులు పొందుపర్చాలని ఆయన చెప్పారు. దీని తర్వాత తుది కీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.