ప్రభుత్వ భూమిలో ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం

కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఫంక్షన్‌ హాల్‌ కోరల్లోకి మారబోతున్న వైనం
అధికారులను తప్పుదోవ పట్టించేందుకు కొత్త ఎత్తు
అనుమతి పశువుల కొట్టముకు .. నిర్మాణమేమో ఫంక్షన్‌ హాల్‌
నిర్మాణం వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంలో అంతర్యం ఏమిటో..?
ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం పూర్తవుతున్న పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ- మునుగోడు
ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం నేరమని తెలిసినప్పటికీ కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి పక్క ప్లాన్‌ ప్రకారంతో ఫంక్షన్‌ హాల్‌ పాలు అవుతున్నది. అది ఎక్కడ ఎలా అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే మునుగోడు మండల కేంద్రంలోని చండూర్‌ రోడ్‌ లో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్‌ 78 లో మండల కేంద్రానికి చెందిన కొంతమంది రైతులకు ప్రభుత్వ వ్యవసాయ భూమి ఉంది ఆ భూమికి సమీపంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉండగా ఆ పాఠశాల విద్యార్థులకు అవసరమైన క్రీడా మైదానం లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కస్తూర్బా పాఠశాలకు ఎకరం భూమిని కేటాయించారు. తమ భూమి కూడా పోతుందేమోనన్న భయంతో అదే సర్వే నెంబర్‌ లో క్రీడా మైదానంకు కేటాయించిన భూమి పక్క రైతులు తమకు ఉన్న భూమిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. అదే అదునుగా భావించి కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అసైన్డ్‌ భూమి అని తెలిసి కూడా భూములను కొన్నారు. అక్రమ నిర్మాణాలను చేపట్టేందుకు పర్మిషన్ల కోసం ఎలాగైనా ప్రభుత్వ భూమికి నాలా కన్వర్షన్‌ కాదని అధికారులను సైతం పక్క తోవ పట్టించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మండల కేంద్రంలోని చండూర్‌ రోడ్‌ లో గల కస్తూర్బా పాఠశాల పక్కన 78 వ సర్వే నంబర్‌ లో పశువుల కొట్టం నిర్మాణం కోసం పర్మిషన్లు తీసుకొని ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వనప్పటికీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న అడ్డుకోకుండా అధికారులు అటుపక్క కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావు కల్పిస్తున్నవి . ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఫంక్షన్‌ హాల్‌ కు కోరల్లోకి వెళ్లేందుకు ముస్తాబవుతున్న ప్రభుత్వ భూమిని రక్షించాలని మండలంలోని ప్రజలు , ప్రజా ప్రతినిధులు ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు గాలికి ..
ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం పనులు చివరికి
చర్యలు ఉండవు .. ఫంక్షన్‌ హాల్‌ పనులు ఆగవ్‌..
ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఓ ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకుడు నిబంధనాలను గాలికి వదిలేసి ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేస్తున్న వైనం సాధారణంగా వ్యవసాయ భూమి లో ఫంక్షన్‌ హాల్‌ , పెట్రోల్‌ బంక్‌ , కాటన్‌ మిల్‌ , రైస్‌ మిల్‌ , ఆయిల్‌ మిల్‌ , ఫ్లాట్స్‌ తో పాటు ఇతర ప్రైవేట్‌ అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ముందుగా వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్‌ చేయించుకునేందుకు రెవిన్యూ అధికారులకు మీ సేవలో నాలా కన్వర్షన్‌ రుసువు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . దరఖాస్తు చేసుకున్న భూమిని రెవెన్యూ అధికారులు ఆ భూమి అక్రమమా సక్రమమా అని దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తాసిల్దార్‌ , ఆర్డిఓ స్థలమును పరిశీలించిన అనంతరం నాలా కన్వర్షన్‌ కు అనుమతి ఇస్తారు కానీ , ప్రభుత్వ భూమి లో నాలా కన్వర్షన్‌ కు అనుమతి ఇచ్చినది ఎట్లా ..? అనుమతి ఇవ్వకపోతే అడ్డదారిన అక్రమ నిర్మాణం చేపడుతుంటే చర్యలు తీసుకోపోవడంలో ఆంతర్యం ఏమిటోనని గుసగుసలు వినిపిస్తున్నాయి . పెద్ద మొత్తంలో చేతులు తడిపేరనే విమర్శలు వినిపిస్తున్నాయి .
వివరణకు స్పందించని తహసీల్దార్‌
మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 78లో గల ప్రభుత్వ భూమి లో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేపడుతున్న విషయంపై వివరణ కోరెందుకు సోమవారం నవతెలంగాణ తాసిల్దార్‌ కార్యాలయం కు వెళ్ళగా తాసిల్దార్‌ కష్ణారెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌ ద్వారా వివరణ కోరెందుకు పలుమార్లు ప్రయత్నించగా తహసీల్దార్‌ స్పందించలేదు ..
ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేపట్టేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు
పేరు: నేలపట్ల నరేష్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మునుగోడు
మండల కేంద్రంలోని చండూర్‌ రోడ్‌ లో గల సర్వేనెంబర్‌ 78 లో నిర్మాణం చేపడుతున్న ఫంక్షన్‌ హాల్‌ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ భూమిలో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేపట్టడం చట్టరీత్యా నేరం . ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధం. ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం చేపడుతున్న వారిపై రెవెన్యూ శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం..