నవతెలంగాణ- కమ్మర్ పల్లి: బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం కమ్మర్ పల్లి మండలం ఉప్లుర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి, ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ కొమ్ముల రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు. మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు నాగరాజు, గంగామణి దంపతులు, హాసకొత్తూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు గంగారెడ్డి, పురోషోత్తం, నర్సయ్య, వెంకట్, రమేష్, వీరితో పాటు మరో 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి, పాలెపు నరసయ్య, నల్ల గణేష్ గుప్తా, శివసారం గణేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.