చెక్ పోస్ట్ లలో నిరంతర నిఘా – ఎస్పీ వినీత్

నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నియమావళి అనుసరించి అంతర్ రాష్ట్ర,అంతర్ జిల్లాల సరిహద్దు చెక్ పోస్ట్ లును ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మద్యం,నగదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. నియోజక వర్గంలోని పలు చెక్ పోస్ట్లను బుధవారం ఆయన తనిఖీ చేశారు.చెక్ పోస్ట్ ల వద్ద నిఘా పర్యవేక్షణ క్షేత్ర స్థాయిలో ఉండాలని, ప్రత్యేకంగా చెక్ పోస్టులకు నిబ్బందిని కేటాయించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. చెక్ పోస్ట్ ల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి తనిఖీల పై పలు సూచనలు చేశారు.  అనంతరం ఎస్పీ మాట్లాడుతు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు.జిల్లా వ్యాప్తంగా 12 అంతర్ రాష్ట్ర, 10 అంతర్ జిల్లాల బెకోస్టలను ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేస్తూ నిఘాను పటిష్టం చేసినట్లు చెప్పారు.గత పది రోజుల్లో రూ.25 లక్షల విలువ గల గంజాయి, రూ. 1 కోటి 24 లక్షల 55 వేల 8 వందలు నగదు, రూ. 1 లక్షా 77 వేల 3 వందల విలువ గల అక్రమ బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.ఎన్నికల నేపద్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట పాల్వంచ డీఎస్సీ వెంకటేష్, సీఐ కరుణాకర్, ఎన్పై శ్రీకాంత్ ఉన్నారు.