కాంట్రాక్టు ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి

నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని సోమవారం మండల పరిధిలోగల సౌత్ క్యాంపస్ ఆవరణంలో కాంట్రాక్టు ప్రొఫెసర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ గుప్తా మాట్లాడుతూ తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని, న్యాయమైన సమస్యను వెంటనే పరిష్కరించాలని, చాలి చాలని జీతాలతో కుటుంబాలను పోషించిపోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ప్రొఫెసర్లు రమాదేవి, సునీత, నరసయ్య, నిరంజన్ శర్మ, సరిత, దిలీప్, వైశాలి పాల్గొన్నారు.