సామాజిక అతనికి బృందానికి సహకరించండి

నవతెలంగాణ – నసురుల్లాబాద్
మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జరిగే ప్రతి పనిలో సామాజిక తనిఖీ బృందానికి పూర్తి సమాచారం అందించి సహకరించాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ సిబ్బంది గ్రామ కార్యదర్శిల తో సమావేశం నిర్వహించారు మండలానికి సామాజిక తనిఖీ బృందం వారు వచ్చారని సామాజిక అతనికి బృందానికి గ్రామ సర్పంచ్ కార్యదర్శి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది సహకరించాలని కోరారు. ఎన్ఆర్ఈజీఎస్‌ 15వ విడతలో బాగంగా సామాజిక తనిఖీ బృందం ఫిబ్రవరి 2020 నుంచి 2023 ఫిబ్రవరి వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై వీరు పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం అధికారులు గ్రామ కార్యదర్శులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.