
మండల సర్వ సర్వ సమావేశంలో జరిగిన చర్చలో ప్రస్తావనకు వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎంపీపీ అధ్యక్షరాలు లోలపు గౌతమి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు చర్చించిన సమస్యల పరిష్కారం పై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. మండలంలో సాగుతున్న పంటల వివరాలను మండల వ్యవసాయ అధికారిని బద్దం లావణ్య సభలో వివరించారు. చౌట్ పల్లి బీసీ హాస్టల్ వద్ద డ్రైనేజీలో విద్యుత్ స్తంభం ఉండడం వల్ల డ్రైనేజీలో మురుగునీరు నిలిచి పారిశుద్ధ్య లోపం తలెత్తుతుందని ఎంఈఓ ఆంధ్రయ్య, హాస్టల్ వెల్ఫేర్ అధికారి దినేష్ సభ దృష్టికి తీసుకువచ్చారు. కమ్మర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద తాగునీటి సమస్య లేదని అధికారులు సభలో తెలిపారు.మండలంలో స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలను ఐకెపి ఏపిఎం కుంట గంగారెడ్డి వివరించారు. మండల కేంద్రంలో ఇటీవల కోతులు కుక్కలు కలిసిన కేసులు సంఖ్య పెరిగిందని తగు జాగ్రత్త తీసుకోవాలని కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ నరసింహస్వామి తెలిపారు. ఈ సమావేశంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గున్వీర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, ఎంపీడీవో సంతోష్ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ మైలారం గంగాధర్, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.