కార్పోరేట్‌ ధీటుగా ప్రభుత్వ బడులు

తహసీల్దార్‌ యోగేశ్వరరావు, ఎంపీడీవో, ఎంఈవో
నవతెలంగాణ-నెల్లికుదురు
కార్పోరేటర్‌ బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోనే విద్య అందుతుందని ఎం ఈఓ గుగులోతు రాము, తహసీల్దార్‌ యోగేశ్వరరావు, ఎంపీడీవో శేషాద్రిలు అన్నా రు. మండల కేంద్రంలోని పార్వతమ్మ గూడెం ఎంపీ యుపిఎస్‌ ప్రభుత్వ పాఠశాల బడిబాట పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కార్పొరేట్‌ పాఠశాల కంటే ఎక్కువగా ప్రభుత్వ బడులోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ పార్వతమ్మ గూడెం పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు డిజిటల్‌ క్లాసులు అందిస్తున్నామన్నారు.అంతేకాకుండా వారికి ఉచితంగా విద్యను ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతుల దుస్తులను వారికి కావాల్సిన నోట్‌ బుక్స్‌, విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏ ర్పాటు చేశామన్నారు. మండలంలోని ఈ పార్వతమ్మ గూడెం పాఠశాల చుట్టు ప్ర క్కల గ్రామాలలో బడిబాటపై అవగాహన కల్పించి తల్లిదండ్రులకు ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయ లు ఖర్చుపెట్టి ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఈ పాఠశాలలో డిజిటల్‌ క్లా సుల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని భారతమ్మ గూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు సిహెచ్‌.జీవన్‌ కుమార్‌, ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌ కుమార్‌, మండల వ్యవ సాయ అధికారి నెలకుర్తి రవీందర్‌ రెడ్డి, మండల పంచాయతీ అధికారి బండారు పార్థసారథి, సిఆర్‌పిబి వీరస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.