రేషన్‌ షాపులో కార్పొరేటర్‌ తనిఖీ

నవతెలంగాణ-ఓయూ
ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధర దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలని కార్పొరేటర్‌ సామల హేమ అన్నారు. గురువారం ఆమె చౌక ధర దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో నిర్వహించే స్టాక్‌ రిజిస్టర్‌, స్టాక్‌ తెలిపే బోర్డులను, బయోమెట్రిక్‌ ఈ-పాస్‌ యంత్రాలను పరిశీలించారు. స్టాక్‌ రిజిస్టర్‌ ప్రకారం ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌, క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ వివరాలు పరిశీలించారు. ఒక్కొక్క షాపులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరికీ సకాలంలో రేషన్‌ బియ్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఅర్‌ఎస్‌ నాయకులు కరాటే రాజు, రాజా సుందర్‌ పాల్గొన్నారు.