నవతెలంగాణ డిచ్ పల్లి
2023-24 విధ్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంకు గాను ఏకలవ్య ఆదర్శ గురుకుల కళాశాల గాంధారి(సిఓఈ) కామారెడ్డి జిల్లా, ఇందల్ వాయి ఈఎంఆర్ఎస్ కళాశాల నిజామాబాద్ జిల్లా మిగిలిన సీట్లకు అడ్మిషన్ కొరకు గాను కౌన్సిలింగ్ బాల బాలికలకు 29 న సోమవారం ఉదయం 10 గంటలకు ఈఎంఆర్ఎస్ గాంధారిలో కౌన్సిలింగ్ నిర్వహించబడు తుందని ఏకలవ్య గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకొనుటకు గిరిజన విద్యార్థులు మాత్రమే అర్హులని అయన తెలిపారు .2022-23 విద్యా సంవత్సరంలో పాసైన విద్యార్థులు మాత్రమే కౌన్సిలింగ్ కు హాజరు కావాలని, పదవ తరగతిలో వచ్చిన జిపిఎ ఆధారంగా సీట్లను కేటాయించబడు తుంది వివరించారు. ఈఎంఅర్ఎస్ గాం ధారిలో బాలురకు మాత్రమే నన్నారు. ఇందల్ వాయి ఏకలవ్య లో బాలికలకు మాత్రమే ఉంటుందని ఆ విషయం గమనించ లన్నారు.
గాంధారి లో మిగిలిన సీట్లు
ఎంపిసి- 05, బిపిసి- 10, సిఈసి -15,
మొత్తం -30,
ఇందల్ వాయి లో మిగిలిన సీట్లు 58
ఎంపిసి -23, బిపిసి -15, సిఈసి -20,
మొత్తం -58 లకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.వచ్చేటప్పుడు తమవేంట కావలసిన సర్టిఫికెట్లు ఆధార్ కార్డు జిరాక్స్2,ఫొటోస్ లేటెస్ట్ (4),క్యాస్ట్ సర్టిఫికెట్ (2),ఇన్కమ్ సర్టిఫికెట్ 2023.24 కొత్తది (2), 2023-24 పాసైన జిపిఏ సర్టిఫికెట్ (ఇంటర్నెట్ మెమో) పైన సూచించిన విధంగా సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని 29.న ఉదయం 10.00 గంటలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ కోరారు.