రోడ్లకు అడ్డంగా గోమాతలు..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో హనుమాన్ దేవాలయాలకు వదిలిపెట్టిన గోమాతలు రోడ్లపై సంచరిస్తూ ఉండడంతో ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయని మండల ప్రజలు వాపోతున్నారు. మండలంలోని వీరన్న గుట్ట, సాటాపూర్, రెంజల్ తదితర గ్రామాలలో రోడ్లకు అడ్డంగా రావడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వారు పేర్కొన్నారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఇట్టి గోమాతలను రోడ్లపైకి రాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.