
రెంజల్ మండలంలోని కందకుర్తి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను జిల్లా సిపి కల్మేశ్వర్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పస్ట్ ద్వారా వెళ్లే ప్రతి వాహనాన్ని, వెహికల్ తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం గురించి అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అంతరాష్ట్ర చెక్పోస్ట్ సైతం ఆయన తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా డబ్బులు తీసుకువెళ్లే వ్యక్తులకు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన అన్నారు. చెక్పోస్టుల గుండా మద్యం సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేయాలన్నారు. ఆయన వెంట ఏసీపీ కిరణ్ కుమార్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్ రాజ్, రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్, చెక్ పోస్ట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.