కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న సీపీ

– పోలీస్ కమీషనర్ సత్యనారాయణ వెల్లడి
నవతెలంగాణ- కంటేశ్వర్
కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ శనివారం తెలియజేశారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కె.మహేష్ బాబు, కానిస్టేబుల్ నెంబర్ 544 కు సంబంధించి ఇటివల నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదురాలితో (ఒక మహిళ ) తో ఫిర్యాదు తీసుకున్న అనంతరం ఆమే సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని, ఆమెతో అసభ్యకరంగా  అనుచితంగా వ్యవహరించి, భార్యభర్తల మధ్య భేదాలు వచ్చే విధంగా వ్యవహరించి నందుకు ఆ విషయం నిజామాబాద్ పోలీస్ కమీషనర్  వి. సత్యనారాయణ, ఐ.పి.యస్. దృష్టికిరావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ శనివారం పట్టి కానిస్టేబుల్ మహేష్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అనంతరం పూర్తిస్థాయి విచారణ కోసం నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడిన సహించేది లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ హెచ్చరించారు.కాబట్టి నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రింది స్థాయి సిబ్బంది నుండి సిపిస్తాయి అధికారుల వరకు జాగ్రత్త వహించాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు.