– జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష
నవతెలంగాణ-మణుగూరు
జూన్ 4వ తేదీ కొత్తగూడెంలో జరిగే సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభకు వేలాదిగా పినపాక నియోజకవర్గం నుండి తరలిరావాలని జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష పిలుపునిచ్చారు. శనివారం మణుగూరు సీపీఐ కార్యాలయంలో పినపాక నియోజకవర్గం బూత్ కమిటీ, మండల కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల సమావేశం సరెడ్డి పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్కే సాబీర్ పాష హాజరై మాట్లాడుతూ… జిల్లా సమగ్ర అభివృద్ధిని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను ఎజెండాగా తీసుకొని పెద్ద ఉద్యమం చేపట్టిందని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, జిల్లాలో నెలకొన్నటువంటి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు త్వరగతిన పూర్తి చేయాలని, గిరిజన, గిరిజనేతరులు పోడు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పోడు రైతుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, గిరిజన బంధు అమలు చేయాలని, సింగరేణి ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధరలను తగ్గించాలని పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, తదితర డిమాండ్స్ పై జరుగు పార్టీ ప్రజా గర్జన బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య మాట్లాడుతూ…. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని నియోజకవర్గంలో బలమైన కేడర్ కలిగిన సీపీఐ గ్రామ గ్రామాన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మూన్న లక్ష్మీకుమారి, కమటం వెంకన్న, రేసు ఎల్లయ్య, జిల్లా సమితి సభ్యులు ఆర్.లక్ష్మీనారాయణ, దుగ్యాల సుధాకర్, ఆక్కి నరసింహారావు, ఎస్.కే.సర్వర్, కుటుంబరావు, సురేష్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు, పట్టణ కార్యవర్గ సభ్యులు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.