
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భువనగిరిలో రోడ్ షోకు ఆదివారం మధ్యాహ్నం 12:30 కు వస్తున్నారని చౌటుప్పల్ మండల సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి గంగాదేవి సైదులు శనివారం పేర్కొన్నారు. మునుగోడు, భువనగిరి నియోజకవర్గాల సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సీతారాం ఏచూరి రోడ్ షోకు చౌటుప్పల్ మండలం నుండి పార్టీ గ్రామ శాఖలు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లాలని గంగాదేవి సైదులు తెలిపారు.