రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతికి గాయాలు

నవతెలంగాణ-ఖమ్మం రూరల్‌
రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల హైమావతి, ఆమె కుమారుడు లెనిన్‌తో కలిసి కారులో ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ప్రమాదవశాత్తు ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో హైమావతికి, లెనిన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని సీపీఐ(ఎం) జిల్లా, మండల నాయకులు పరామర్శించారు.