నవతెలంగాణ – కంటేశ్వర్
ఇళ్ల స్థలాల కొరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభమైందని నిజామాబాద్ సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలియజేశారు. ఈ మేరకు గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల కొరకు కొండం చెరువు కట్టపైన 171 సర్వే నంబర్ లో ఉన్న మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున. ఆ భూమిలో వందలాదిమంది నిరుపేదలతో ఇండ్ల స్థలాల కొరకు న గుడిసెలు వేసి ఎర్రజెండాలను కట్టడం జరిగింది.. అనంతరం జరిగిన సభలో జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలను ఇండ్ల నిర్మాణం కొరకు రుణాలను ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలంగా ఇండ్ల స్థలాలు ఇండ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో అధికారులకు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకొని తరబడి తిరిగిన నివాస స్థలాలు రాకపోవడంతో విసిగి వేసారి నా పేదలు ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీసుకొని అక్రమ సంపాదన గడి ఇస్తున్నప్పటికీ చూసి చూడనట్టుగా వివరించటంతో పేదలు నిరాధారణకు గురవుతున్నారని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించటానికి సిపిఎం పార్టీ సిద్ధపడ్డదని తల ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని 171 సర్వే నంబర్లు ఉన్న ఎనిమిదిన్నర ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురై కేవలం మూడున్నర ఎకరాలు మాత్రమే మిగిలిందని ఈ భూమిపైన కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధనవంతుల కండ్లు పడి దాన్ని కూడా కాజేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములను పేదలకు పట్టాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు ఇవ్వాలని అంతవరకు పేదలందరూ ఐక్యంగా పోరాడాలని వారు అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, వెంకటేష్,, గోవర్ధన్, నగర కార్యదర్శి పి. సూరి, నగర నాయకులు సుజాత, కటారి రాములు, అబ్దుల్, మహేష్ మరియు పెద్ద ఎత్తున నిరుపేద ప్రజలు తదితరులు పాల్గొన్నారు.