నవతెలంగాణ-ఐనవోలు
కేంద్రాల్లోని బిజెపి, రాష్ట్రం లోని బిఆర్‌ఎస్‌ను రా బోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ఓడించాలని సీపీ ఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగ య్య ప్రజలకు పిలుపుని చ్చారు. శనివారం వెంకటాపురం గ్రామకమిటీ సమావేశం దీ కొండ ఉప్పలయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన లింగయ్య మా ట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐ సి, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే విమానాశ్ర యాలతో పాటు అనేక ముఖ్యమైన సంస్థలను తన అనుచరులైన ఆదానీ, అంబానీలకు మోడీ తాకట్టు పెట్టారని. దళిత, ముస్లిం, క్రిస్టియన్ల పైన మతోన్మాదులు హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిపోయాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె నారాయణ రెడ్డి, డి.ఉప్పలయ్య, మోహన్ రావు, బొమ్మ కంటి యాకయ్య, జక్కుల నర్సయ్య, కవిత, మనమ్మ, సలీం రాజ్ తదితరులు పాల్గొన్నారు.