సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

– టీఎస్‌సీపీఎస్‌ఈయూ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
‘పెన్షన్‌ సంస్కరణలో భాగంగా పీఎఫ్‌ఆర్‌డీఏ బిల్లు ఎన్‌డీఏ ప్రభుత్వం 2003లో ప్రవేశపెట్టింది. ఆర్డినెన్స్‌ రూపంలో వచ్చిన బిల్లుకి అనుగుణంగా కేంద్రంలో 1-1-2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ విధానం వర్తిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్‌ 1,2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు సీపీఎస్‌, ఎన్‌పీఎస్‌ వర్తింపజేస్తూ జీవో 653,654, 655 ద్వారా వర్తింపజేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తదుపరి జీఓ 28 ద్వారా సీపీఎప్‌ విధానాన్ని అడాప్ట్‌ చేసుకున్నారు’.
సీపీఎస్‌ విధానం..
జనవరి 1, 2004 రోజు ఆ తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్‌ 1, 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్‌, సీపీఎస్‌ పథకం పరిధిలోకి వస్తారు. వీరి సంఖ్య తెలంగా ణలో 1,70,000 పై చిలుకు, ప్రస్తుత ఉద్యోగుల్లో 60 శాతం దేశం మొత్తం కలిపి దాదాపుగా కోటి వరకు ఉంటా రు అని అంచనా. ఈ పథకం పరిధిలోని ఉద్యోగుల నెల వారీ మూలవేతనం, కరువు భత్యం నుంచి 10శాతం రిక వరీ చేస్తారు. దీనికి అదనంగా ప్రభుత్వం 10శాతం కలిపి ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ ద్వారా ఉద్యోగుల పీఆర్‌ఏఎన్‌ అకౌంట్‌లో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 10శాతం ప్రభుత్వ వాటాగా 14శాతం కలిపి జమ చేస్తారు. ఉద్యో గుల పీఆర్‌ఏఎన్‌ ఖాతాలో జమైన డబ్బులను ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ ద్వారా పీఎఫ్‌ఆర్‌డీఏ ఆమోదం పొందిన పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్‌ ఖాతాలకు నిర్ణీత నిస్పత్తి (33:32:35) ప్రకారం బదిలీ చేస్తారు. బదిలీ చేయబడిన ఆ డబ్బుల్ని పీఎఫ్‌ఆర్‌డీఏ వద్ద ధ్రువీకరణ పొంది, ఫండ్‌ మేనేజర్ల వద్ద రిజిస్టర్‌ ఐన కంపెనీల్లో, షేర్‌, ప్రభుత్వ సెక్యూరిటీస్‌, స్వల్ప కాలిక ఋణ పత్రాలు, స్టాక్స్‌ రూపంలో పెట్టుబడులు పెడ తారు. ఆ పెట్టుబడుల్లో ఈక్వీటీస్‌లో 15శాతంకి మించి పెట్టకూడదని షరతు. ఈ పెట్టీబడులు కూడా ఉద్యోగి వయస్సు, వాటిని పరిగననలోకి తీసుకుని ప్రమాదం తక్కు వగా ఉన్న కనీస హామీ ఉన్న వాటిలో పెడుతారు. అలా పెట్టిన పెట్టుబడుల పై లాభాలకు ఎలాంటి హామీ లేదు. నష్టాలు కూడా రావచ్చు. లాభాలు చాలా పరిమితంగా మాత్రమే ఉంటవి. పెట్టుబడి పై వచ్చే లాభాలని నికర ఆస్థి విలువగా చూపుతారు. అది నిరంతరం మారుతూ ఉంటుంది. పెన్షన్‌ ఫండ్‌లో పెట్టుబడులపై లాభ నష్టాలపై కనీస హామీలు ఉండవు అనీ, అవి పూర్తిగా మార్కెట్‌ ఆధారిత శక్తులపై ఆధారపడి ఉంటాయని పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్నారు.
ఉపసంహరణ 3 రకాలు
1.పాక్షిక ఉపసంహరణ
2.స్వచంద పదవీ విరమణ
3.పదవీ విరమణ పొందిన వేళ
1.పాక్షిక ఉపసంహరణ : ఉద్యోగి మొత్తం సర్వీస్‌లో మూడు సార్లు మాత్రం అతని/ఆమె పీఆర్‌ఏఎన్‌లో జమైన మొత్తంలో ఉద్యోగి వాటాలో 25శాతం వరకు ఉపసంహరించుకునే వీలుంది.
2.స్వచ్చంద పదవీ విరమణ/ఉద్యోగి మరణిస్తే.. : పీఆర్‌ఏఎన్‌ ఖాతాలో జమైన మొత్తంలో 80శాతం పెన్షన్‌ ప్లాన్‌ తప్పనిసరిగా కొనాల్సి ఉంటుంది. 20శాతం మాత్రమే ఉద్యోగికి / కుటుంబ సభ్యులకు ఇస్తారు. పెన్షన్‌ ప్లాన్‌ ఆధారంగా పెన్షన్‌ వస్తుంది. ఖాతాలో రూ.5 లక్షల లోపు ఉంటే మొత్తం డబ్బుని ఉపశమహరించుకోవచ్చు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం జీవో 58 ద్వారా ఫ్యామిలీ పెన్షన్‌ మంజూరు చేస్తారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యులు అప్పటి వరకు ఆ ఉద్యోగి పీఆర్‌ఏఎన్‌ ఖాతాలో జమ ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తామని హామీ పత్రం ఇచ్చిన యెడల వారికి ఫ్యామిలీ పెన్షన్‌ మంజూరు చేస్తారు.
3.పదవీ విరమణ : పదవీ విరమణ చెందిన ఉద్యోగి పీఆర్‌ఏఎన్‌ ఖాతాలో జమైన మొత్తంలో 40శాతం తప్పనిసరిగా పెన్షన్‌ ప్లాన్‌ కొనాల్సి ఉంటుంది. 60శాతం ఉద్యోగికి ఇస్తారు. ఉద్యోగి కొన్న పెన్షన్‌ ప్లాన్‌ మీద ఆధారపడి ఆ ఉద్యోగికి నెల నెలా నిర్ణీత పెన్షన్‌ వస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి పెంపుదల ఉండదు.
పాత పెన్షన్‌, సీపీఎస్‌కి తేడా..
పాత పెన్షన్‌లో ఉద్యోగి చనిపోయిన/పదవీ విరమణ పొందిన ఆ ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో సగం ప్రతి నెలా పెన్షన్‌ రూపంలో ఇస్తారు. ఇందుకు గాను ఉద్యోగి ఎలాంటి కాంట్రిబ్యూషన్‌ జమ చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగి చనిపోతే అతనికి 65 ఏండ్ల వయసు వచ్చేంత వరకు చివరి మూలవేతనంలో 50శాతం తదుపరి మూలవేతనంలో 30శాతం ఇస్తారు. ఈ రెండు విలువ కనీస పెన్షన్‌ కన్నా తక్కువ ఉంటే కనీస పెన్షన్‌ ఇస్తారు. దానిపై కరవు భత్యం ఇస్తారు. పెన్షన్‌ 40శాతం వరకు కమ్యూటేషన్‌ చేసుకోవచ్చు. ఆరోగ్య పథకం వర్తిస్తుంది. కరవు భత్యం ఉద్యోగికి మాదిరిగానే ఇస్తారు. ప్రతి పీఆర్‌సీలో పెన్షన్‌ రివైస్‌ అవుతుంది హాస్పిటల్‌ ఖర్చులు ప్రభుత్వం తిరిగి చెల్లి స్తుంది. సీపీఎస్‌ విధానంలో ఇలాంటి ప్రయోజనాలు ఏమీ వర్తించవు. ఎన్‌పీఎస్‌, సీపీఎస్‌ విధానంలో పెన్షన్‌ పెట్టుబ డులపై పూర్తిగా ఫండ్‌ మేనేజర్లదే పూర్తి విచక్షణ. ఉద్యోగు ల జోక్యం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండదు. ఫండ్‌ మేనేజర్లపై పీఎఫ్‌ఆర్‌డీఏ అధికారుల, పెట్టుబడిదారుల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఫండ్‌ మేనేజర్లు ప్రలో బాలకు లొంగి అనుకూలమైన సంస్థల్లో అధిక పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.కనీస హామీ లేని జీవనది లాంటి ఈ పెట్టుబడిపై కన్నేసిన పెద్దలు డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడులు కొళ్లగొట్టే ప్రమాదముంది. ఇటీవలి కాలంలో స్టాక్‌ మార్కెట్‌లో అదానీ షేర్ల పతనంతో సీపీఎస్‌ ఉద్యోగుల పీఆర్‌ఏఎన్‌ ఖాతాల్లో ఎన్‌ఏవీ వేలల్లో పడిపో వడం ఈ ప్రమాదాన్ని రుజువు చేస్తుంది.
ఎస్‌సీపీఎస్‌యూ డిమాండ్‌..
పెట్టుబడి దారి మస్తీష్కపు పుట్టలో ఎదిగిన పీఎఫ్‌ ఆర్‌డీఏ చట్టం నుంచి మొలకెత్తిన విషపు భీజం సీపీఎస్‌, ఎన్‌పీఎస్‌. ఇది వృద్ధాప్యంలో ఉద్యోగి జీవితంలో మరణ శాసనంలా పరిణమించే అవకాశం ఉంది. అందుకే ఈ విషపు బీజం ఇంకా విస్తరించకముందే అంతం చేయాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ నిరంతరం పోరాటం చేస్తుంది. పెన్షన్‌ అనేది ఉద్యోగి దీర్ఘ కాలం పని చేసినందుకు ఇచ్చే పరిహారం/ప్రతిఫలం మాత్రమే కాదు. అందులో ఉద్యోగుల సామాజిక ఆర్ధిక ప్రయోజనాలు దాగి ఉన్నది అనే విష యాన్ని 1982లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుని కూడా పట్టించుకోకుండా వృద్ధాప్యంలో శాపంలా పరిణామించే మార్కెట్‌ ఆధారిత పెన్షన్‌ పథకాన్ని అమలు చేయడం అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల ఉసురు తీయడమే. దశాబ్ద కాలంగా విన్నపాలకే పరిమిత మైన సీపీఎస్‌ రద్దు అంశాన్ని, ” పెన్షన్‌ బిక్ష కాదు ఉద్యగి హక్కు ” అని నినదించి 2016లో పోరుబాట పట్టించి పోరాట బాపుటా ఎగరేసింది టీఎస్‌సీపీఎస్‌ఈయూ. నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తూ శాంఖరావం, సామూహిక సెలవు, ఆయత ధర్మదీక్ష, ఖిలఫ త్‌ దివస్‌, జన జాతర, సత్యాగ్రహ దీక్ష వంటి రూపాల్ని అనుసరించి సీపీఎస్‌ ఉద్యోగులకు డీసీఆర్‌జీ, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్‌ సాధించి పెట్టిన ఘనత టీఎస్‌సీపీఎస్‌ఈయూది. ఇటీవలి కాలంలో దేశంలో పాత పెన్షన్‌ రద్దు కోసం జరిగిన పోరాటల్లో ఎన్‌ఎంఓపీఎస్‌ (నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం) పాత్ర మరువలేనిది. ఎన్‌ఎంఓపీఎస్‌కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్టిత ప్రజ్ఞ ఉండటం మనకి గర్వ కార ణం. ఎన్‌ఎంఓపీఎస్‌ పోరాటాల ఫలితంగా పంజాబ్‌, రాజ స్థాన్‌, చత్తిస్‌ఘడ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు సీపీ ఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరు ద్దరించాయి. నిన్నటి వరకు సీపీఎస్‌ రద్దు రాష్ట్రాల పరిదిలోని అంశం కేంద్రానికి సంబంధం లేదు అని సుద్దులు పలికిన కేంద్రం ఇప్పుడు రద్దు చేసిన రాష్ట్రాలపై కర్ర పెత్తనం చేస్తూ ఉద్యోగుల పీఆర్‌ఏఎన్‌ ఖాతాలోని నిధు లను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వకుండా, ఆర్ధిక ఆంక్షలు విధించ డం, భారత ప్రభుత్వ అధీనంలోని ఆర్ధిక సంస్థల చేత ప్రకటనలు చేయిస్తూ ఆయా రాష్ట్రాలను పరోక్షంగా బెదిరిం చడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బెదిరంపు దోరణుల్ని టీఎస్‌సీపీఎస్‌ఈయూ తీవ్రంగా వ్యతిరేకస్తుంది. పాత పెన్షన్‌ సాధన కోసం నిరంతర పోరాటం చేస్తున్న టీఎస్‌సీపీఎస్‌ఈయూ 2023లోనే సీపీఎస్‌ అంతం మన పంతం నినాదంతో ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. సీపీఎస్‌ రద్దు చేసిన రాష్ట్రాల్లోని ఉద్యోగుల పీఆర్‌ఏఎన్‌ ఖాతాల్లో జమైన డబ్బును తిరిగి ఇచ్చే విధంగా కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కూడా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా భవిష్యత్‌ ఉద్యమ కార్యా చరణ రూపొందించి రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఉద్యమ కార్యాచరణ..
ఏప్రిల్‌ 16న 33 జిల్లా కేంద్రాల్లో పెన్షన్‌ కాన్స్టిట్యూ షనల్‌ మార్చ్‌ పేరిట ర్యాలీలు మే నెలలో సామాజిక భద్రత కోరుకునే ఉద్యోగి సామాజిక బాధ్యతలో భాగంగా చలి వేంద్రాల ఏర్పాటు, సామాజిక కార్యక్రమాలు, జూన్‌ రెండో వారం నుంచి పాత పెన్షన్‌ సంకల్ప సాధన యాత్రకు డివిజన్ల వారీగా సదస్సులు, జులైలో రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్‌ సాధన సంకల్ప బస్‌ యాత్ర, ఆగస్టు 23న హైదరా బాద్‌లో లక్షా 70వేల కుటుంబాలతో రాజకీయ రణరంగ మహాసభ అన్ని రాష్ట్రాల సీపీయస్‌ ఉద్యోగులతో అక్టోబర్‌ 1 న ఢిల్లీ లోపెన్షన్‌ శంఖ్‌ నాధ్‌ కార్యక్రమం చేపడుతు న్నట్టు టీఎస్‌సీపీఎస్‌ఈయూ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు చెప్పారు.