మద్దతు ధరను కంది పంట రైతులు సద్వినియోగం చేసుకోవాలి

– దళారులకు అమ్ముకొని మోసపోకండి
– పిఎసిఎస్ సెక్రటరీ బాబురావు పటేల్

నవతెలంగాణ మద్నూర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కంది పంటకు మద్దతు ధర ప్రకటించింది క్వింటాలుకు రూ.7550 కేటాయించారు. మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ యార్డులో మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యదర్శి జే బాబురావు పటేల్ మాట్లాడుతూ కంది పంట రైతులు మద్దతు ధరను సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. దళారులకు అమ్ముకొని మోసపోవద్దని తెలిపారు. కంది పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఏ ఈ ఓ స్వామ్యశ్రీ, మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ చందర్, సింగిల్ విండో సిబ్బంది విటల్, అమాలి ముఖదం రాములు, రైతులు పాల్గొన్నారు.