
తూర్పు కొండను ముద్దాడిన జన ప్రభంజనం
తాడిత పీడిత బాధలను గాథలను తట్టిలేపి
హృదయ తంత్రీ మీటి ప్రళయ నాధమైన పాటల రుద్రవీణ..
ఒకడిగా మొదలై అందరి కోసం మాటను పాటుగా మలచి
ఎందరినో రగిలించి కదలించిన పొద్దు తిరుగు పువ్వు
బూర్జువా భూస్వామ్య వ్యవస్థకు పాడె గట్ట
ఇంద్రవెల్లిలో కొండల్లో పుట్టిన ఇంద్ర ధనుస్సుల సోయగం
అమరుల మెడలో పాటల హారం
తెలంగాణ పోరులో వేగు చుక్క
బుడుగు ఆశలను భుజాన మోసిన యుద్ధనౌక..
కారం చెడు కామాంధుల దాష్ఠికం
మట్టి బతుకుల ఎట్టిని కండ్లు జూసి కండ్లెర్ర చేసి
దోపిడి పై ఎక్కు పెట్టిన జంగు సైరన్
అనగారిన బ్రతుకులకు ఆయధమైన జన నాట్యం
ఇప్ప పూల నాటు ఘాటు విల్లులకు బతుకును నూరి పోసిన
రేల పూల నాగ సారం..
మాటు వేసి కాటు వేసె మృగం వినోదపు వేట
అడవి ఆకుల అలజడులు
పావురాల జంటలు పాలపిట్టల అందాలు
పైడికంటేల రాగాలు కట్ల పాముల కట్లు నాగుపాము నడకలు
బండల గుద్దుకొని కొండల డీకొనె కొండ చిలువల కోరలు
అడవి అందాలు అలుముకున్న జీవితాలు
ప్రకృతి ప్రసవ వేధన
సున్నితంగ విప్పి చెప్పిన సుందర కవి హృదయం
పరువశంతో పుకరించి పలవరించిన తల్లి మనస్సు..
వేడుకేదైన వేధికేదైన
పలికె ప్రతి మాట జనం మాట
నడిసె బాటేదైన జనం బాటే
బూటకం మాటల గుట్టు రట్టే
ప్రజాస్వామ్య హక్కులకై ప్రతి చోటా ఎడ తెగని సమరమే
ప్రజా సాహిత్యమే పరమ హితంగా
కైగట్టి కాలుకు గజ్జ గట్టిన కంచు నాధం
గానమే పాణంగా ఆడి పాడి అలిసి సొలసిన కాయం..
ఒక గొంతుక ఆగిపోయింది
ఒక మెరుపు తార నేల రాలినది
ఒక యోధుడు నింగికెగసినడు
గోసీ గొంగడి గొడ్డలి చిప్పా యాంగికంగగా
కడదాకా సాగుతున్న పయనంకు
కన్నీటి నీరాజనం..
రాలిన ఎండుటాకులన్ని పండినవె
పగిలిన ఆశలన్ని చేజారిన పచ్చని బతుకులెనని
రేపటి ఉదయం కోసం
ఒక విత్తనం హామి ఇస్తుంది
ఆశల అంకురం మొలకెత్తించ
ఒక తల్లి పురుడు పోస్తుంది బావికి తావిగ భవిష్యత్ పాటను నడిపించ
తెలంగాణ గట్టుపై నడుస్తున్న పొద్దుగా..
– తప్పెట ఓదయ్య(ఉపాధ్యాయులు,రచయిత)
గ్రామం.దాచారం,మం.బెజ్జంకి,సిద్దిపేట జిల్లా.
9441641702.