కరెంట్‌ అఫైర్స్‌

భారత ప్రభుత్వం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం జార్ఖండ్‌ రాష్ట్రంలో A-HELP (Accredited Agent for health and Extension of Live stockA-HELP కార్యక్రమం
భారత ప్రభుత్వం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ విభాగం జార్ఖండ్‌ రాష్ట్రంలో A-HELP (Accredited Agent for health and Extension of Live stock Production) కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యాధి నియంత్రణ, జంతుటాగింగ్‌, పశువుల బీమాకు గణనీయంగా దోహదపడే అక్రెడిటెడ్‌ ఏజెంట్‌గా మహిళలను నిమగం చేయడం ద్వారా వారిని శక్తివంతం చేయడం. ఈ పథకం ద్వారా రైతులు ఇంటి వద్దకే వెటర్నరీ సేవలను పొందడంతో పాటు పశు సఖీయులకు సాధికారత అందిస్తుంది.
మలేరియా టీకాకు ఆమోదం
భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (NII) సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. ఇది 3 డోసుల టీకా. మలేరియాపై 75 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. 2021లో ఔనఉ +చీఖ సంస్థ రూపొందించి టీకాను ఆమోదించింది. అయితే అది 30శాతం మాత్రమే ప్రభావ వంతంగా పని చేస్తుంది.
టిబెట్‌ హిమనీ నదులను ప్రభావితం చేస్తున్న ధార్‌ ఎడారి ధూళి
భారత్‌ దేశంలోని ధార్‌ ఎడారి నుంచి వచ్చే ధూళి టిబెటన్‌ పీఠభూమిలోని హిమనీ నదులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఇటీవల ఒక అధ్యయనం కనుగొంది. నేచరల్‌ క్లైమెట్‌ చేంజ్‌ అనే జర్నల్‌లో ప్రచురించ బడిన ఈ అధ్యయనం ధార్‌ ఎడారి నుంచి వచ్చే ధూళి హిమనీ నదాల ఆల్జెడోను తగ్గిస్తుందని నివేదించింది. ఈ ధూళి సూర్యరశ్శిని తిరిగి అంతరిక్షంలోనికి ప్రతిబించించి తిరిగి హిమనీ నదాలు ఎక్కువ సూర్యరశ్శిని గ్రహించేలా చేసి వేగంగా కరిగేందుకు కారణమవుతుందని పేర్కొంది.
భూకంప హెచ్చరికలు ప్రారంభించిన గూగుల్‌
వినయోగ దారులకు ముందస్తు హెచ్చరికలు అందించడానికి Aఅసతీaఱస భూకంప హెచ్చరిక వ్యవస్థను గూగుల్‌ ప్రకటించింది. ఈ వ్యవస్థ ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉంది. అయితే గూగుల్‌ ఇప్పడు దీనికి నేషనల్‌ డిజాస్టర్‌ మెనెజ్‌మెంట్‌ అదారిటీ (NDMA), నేషనల్‌ సిస్మోలజి సెంటర్‌ (NSC) తో సంప్రదించి భారత్‌కు ఈ విధానంను తీసుకొని వస్తుంది. యాక్సిలోరో మీటర్‌ను సిస్మొగ్రాప్‌గా ఉపయోగించి మీ ఫోన్‌ను భూకంప డిటెక్టర్‌గా మార్చడం ద్వారా ఈ సిస్టం పని చేస్తుంది.
భారత్‌లో 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం – హోయసల దేవాలయం
కర్ణాటకలోని ప్రసిద్ధ హౌయసల దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన 42వ ప్రదేశంగా గుర్తించబడింది. 12,13వ శతాబ్ధాలలో నిర్మించబడిన హౌయసలల బేలూర్‌, హళేబీడ్‌, సోమనాధపుర దేవాలయాలు ఇప్పటికే ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) రక్షిత స్మారక చిహ్నాలు.
ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌ రూములను అందించిన మొదటి జిల్లా – బరేలి
ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లను అందించిన మొదటి జిల్లాగా బరేలి నిలిచింది. దేశంలో కూడా ఈ ఘనత సాధించిన మొదటి జిల్లాగా బరేలీ అవతరించింది. ఈ జిల్లా పరిధిలో 2,546 పాఠశాలల్లో 2,483 పాఠశాలల్లో వీటిని అమర్చినట్లు ప్రకటించారు. స్మార్ట్‌ తగతులు అంటే ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివన వైట్‌ కీ బోర్టుల వంటి డిజిటల్‌ సాంకేతికతతో కూడిన తరగతి గదులు.
(SHRESHTA) పథకం
భారత ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ) విద్యార్థుల కోసంSHRESHTA (లక్ష్యిత ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు రెసెడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌) అనే కొత్త పథకాన్ని ఆమోదించింది. శ్రేష్ఠ పథకం ద్వారా నేషనలన టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష ద్వారా ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ఎస్సీ విద్యార్థులు ఎంపిక చేయబడతారు.