ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేంద్రాల పేరు మార్పు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వ ర్యంలో నడిచే ఆయు ష్మాన్ భారత్ హెల్త్ వెల్‌నెస్ కేంద్రాలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ”ఆరోగ్యం పరమం దినం” అని ఎ ట్యాగ్ లైన్‌గా పెట్టారు. దేశంలో 1.6 లక్షల ఆయుష్మాన్ భారత్ వెల్‌నెస్ కేంద్రాలు వున్నాయి. ఇక నుంచి వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా పిలుస్తారు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ఆవిష్కరించిన చైనా
ప్రపంచంలోనే అ త్యంత వేగవంత ఇంట ర్నెట్‌ను చైనా ఆవిష్కరిం చింది. ఇది సెకన్‌కు 1.2 టెరాబిట్‌లను ప్రసారం చేయగలదని చైనా తెల్పింది. ఈ వేగం ప్రస్తుత ఇంట ర్నెట్‌కు పదిరెట్లు ఎక్కువ సింఘాలా విశ్వ విద్యాలయం చైనా మొబైల్, హువారు టెక్నాలజీస్, సెర్నెట్ కార్పో రేషన్‌లు దీనిని అభివృద్ధి పరిచాయి. ప్రత్యేక అప్టికల్ పైబర్ కేబుల్ సిస్టం ద్వారా 3000 కిలోమీటర్లు ఈ ఇంటర్‌నెల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
మహాపరినిర్వాన్ దివస్ 2023
భారత చరిత్రలో మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్థంతిని పురస్క రించుకొని 2023 డిసెంబర్ 6న మహా పరినిర్వాన్ దివాస్ 2023ను జరుపు కుంటారు. మహాపరినిర్వాణం అనే పదం బౌద్ధమతం ప్రాధమిక భావన పరినిర్వాణ నుంచి దాని ప్రాముఖ్యతను పొందింది. ఆయన మరణానికి గుర్తుగా మహాపరి నిర్వాణ దివాస్ అనే పదాన్ని ఉపయో గించడం గౌరవనీయ బౌద్ధ నాయకుడిగా ఆయన స్థాయిని నొక్కి చెబుతుంది.
– కె. నాగార్జున
కరెంట్ ఎఫైర్స్ సీనియర్ ఫ్యాకల్టీ
9490352545