కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsఅడోబ్‌ తో అవగాహన ఒప్పందం : అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్లికేషన్‌ ను ఉపయోగించి తరగతి గదులలో సృజనాత్మక వ్యక్తీకరణను అభివృద్ధి చేయడంలో పిల్లలకు సహాయ పడడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దర్మేంద్ర ప్రదాన్‌. గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ మేజర్‌ అడోబ్‌తో ఎమ్‌.ఒ.యు పై సంతకం చేశారు. అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం అధ్యాపకులు వృత్తి పరమైన అభివృద్ధికి డిజిటలైజేషన్‌, కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణల సమయంలో విద్యార్థులు భాగస్వామ్యం కావడం మొదలైన అంశాలకు ఉపయోగకారిగా వుంటుంది.
కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించిన జపాన్‌ : అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ప్రకృతిలో కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించింది. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన యుషుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ‘ఆక్సిజన్‌ 28’ అనే కొత్త రకం ప్రాణవాయువును గుర్తించింది. ఈ ఆక్సిజన్‌ 28 ఐసోటోప్‌ 20 న్యూట్రాన్లు, 8 ప్రోటాన్లను కలిగి వుంటుందని సమాచారం. ప్రకృతిలో ఇది అసాధారణమైన ఆక్సిజన్‌ అని శాస్త్రవేత్తలు అభివర్ణించారు.
భారత్‌కు త్వరలో శివాజీ ఆయుధం : చత్రపతి శివాజీ మహరాజ్‌ వినియోగించిన ఆయుధం బాఫ్‌ు నఖ్‌ (పులిగోరు) వందల ఏళ్ల తరువాత తిరిగి భారత్‌కు చేరుకోనుంది. శివాజీ 1659 లో బీజాపూర్‌ సుల్తానేట్‌ కమాండర్‌ అప్జల్‌ ఖాన్‌ను అంతమొందించడానికి ఈ ఆయుధాన్ని వినియోగించారు. తరువాత కాలంలో బ్రిటీష్‌ అధికారి దానిని బహుమతిగా బ్రిటన్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ ఆయుధాన్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్‌ అంగీకరించింది. మహరాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి ముంగటివార్‌ మీడియాలో మాట్లాడుతూ చత్రపతి శివాజీకి చెందిన ‘వాఫ్‌ునఖ్‌’ ను తిరిగి ఇవ్వడానికి బ్రిటీష్‌ అధికారులు అంగీకరించారని తెలిపారు.
దాడి నుంచి విద్యను రక్షించే అంతర్జాతీయ దినోత్సవం 2023 : దాడి నుంచి విద్యను రక్షించే అంతర్జాతీయ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 9 న నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలు విద్యాసంస్థలపై పెరుగుతున్న దాడులకు ప్రతిస్పందనగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం థీమ్‌… ‘విద్యను పరిరక్షించాలి, బాధితులకు న్యాయం చేయాలి’.
అజరు టు యోగి ఆదిత్యనాద్‌ – శంతను గుప్తా : ఇటీవల విడుదలైన గ్రాఫిక్‌ నవల ‘అజరు టు యోగి ఆదిత్యనాధ్‌’ 67 అత్యధిక పుస్తకావిష్కరణలను సాధించి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత రచయిత శంతను గుప్తా రచించిన ఈ అద్భుత నవల ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ జీవితాన్ని లోతుగా పరిశోధిస్తుంది. సాధారణ ప్రారంభ జీవితం నుంచి రాజకీయ నాయకత్వ శిఖరాగ్రానికి ఆయన ప్రయాణాన్ని ఈ నవల వివరిస్తుంది.
ఉమెన్స్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ డబ్యు బ్రాండ్‌ అంబాసిడర్‌ – అనుష్క శర్మ : ఉమెన్స్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ డబ్యు తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా అనుష్క శర్మను నియమించింది. ఈ భాగస్వామ్యంతో ఆధునిక స్ఫూర్తితో పండుగ ప్రచారాన్ని ప్రారంభించడానికి బ్రాండ్‌ డబ్యు సిద్దమవుతుంది. ప్రతిపండుగలకు, వేడుకలకు మహిళలే కేంద్ర బిందువులుగా వుంటారని తన ప్రచారంలో తెలుపుతుంది.
ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి పెన్షన్‌, ఒ.బి.సి స్టేటస్‌ : సామాజిక సమ్మిళితను పెంపొందించడానికి జార్ఖండ్‌ ప్రభుత్వం తన సార్వత్రిక పెన్షన్‌ పథకంలో ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీని చేర్చి ఒక ప్రగతిశీల చర్య తీసుకుంది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రకటించడం జరిగింది. ట్రాన్స్‌జెండర్స్‌ కోసం ముఖ్యమంత్రి రాజ్య సమాజిక్‌ సురక్ష పెన్షన్‌ యోజన ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెల్పింది. అర్హులైన లబ్దిదారులకు నెలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు.
మొరాకోలో భారీ భూకంపం : ఆఫ్రికన్‌ దేశం మొరాకోలో శుక్రవరాం రాత్రి భారీ భూకంపం సంభవించింది. కనీసం 820 మంది మృతి చెంది వుంటారని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మొరాకో మర్రకేచ్‌ నగరం కేంద్రంగా రిక్టర్‌ స్కేలు పై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 300 మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో మృతుల సంఖ్యపై నిర్దారణకు రాలేమని ప్రభుత్వం చెబుతుంది. 1960 లో మొరాకోలో వచ్చిన భూకంపం (5.8 తీవ్రత) లో వేలమంది చనిపోయారు.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545