‘జనాభా దామాషా ప్రకారం దళిత బంధు కేటాయించాలి’

నవతెలంగాణ-కొడంగల్‌
తెలంగాణ మాల మహానాడు వికారాబాద్‌ జిల్లా అధ్య క్షులు ఏం.వెంకటేశం మంగళవారం ఎమ్మెల్యే పట్నం నరేం దర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి కొడంగల్‌ నియోజకవర్గంలోని దళితబం ధులో మాలలకు దళితబంధు ఇవ్వాలని, నియోజకవర్గ కేంద్రంలో మాలల సంక్షేమ భవనం నిర్మించాలని, ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధులో కొడంగల్‌ నియోజకవర్గంలోని మాలలకు సముచిత స్థానం కల్పించాలన్ని కోరారు. దళితబంధు మొదటి విడతలో భా గంగా చాలా తక్కువ యూనిట్లు మాలలకు కేటాయించార ని తెలిపారు. రెండో విడతలో జనాభా దామాషా ప్రకారం ప్రతి గ్రామంలో 2,3 యూనిట్లు కేటాయించాలని కొడం గల్‌ నియోజకవర్గ కేంద్రంలో మాలల సంక్షేమ భవనానికి 1000 గజాల స్థలాన్ని కేటాయించాలని వినతి పత్రం అందించారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిం చారు. కార్యక్రమంలో పవన్‌ కుమార్‌, ఎం.కృష్ణంరాజు, ఎం. యాదయ్య, ఏం వెంకటయ్య, తదితరులున్నారు.