అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలి

నవతెలంగాణ-మహదేవపూర్‌
అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని కోరుతూ మహాదేవపూర్‌ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై మంగళవారం ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు బెల్లం పల్లి సురేష్‌ మాదిగ మాట్లాడుతూ నిజమైన అర్హులకు దళిత బంధు వర్తింప చేయాలని, లేదంటే రాజకీయ నాయకులు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సమత సైనిక్‌ దల్‌ జిల్లా నాయకులు బుర్రి శివరాజ్‌, మాల మహానాడు నాయకులు మెర్గు పెద్ద సమ్మయ్య, నేతకాని సంఘం నాయకులు జనగాం సమ్మయ్య, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు నల్లబూగ ధర్మయ్య, ఎంపీఎస్‌ మండల అధికార ప్రతినిధి మంథని రవితేజ తదితరులు పాల్గొన్నారు.