– ప్రధాన రహదారి పై దళితుల ధర్నా
నవతెలంగాణ-బయ్యారం
తెలంగాణ ప్రభుత్వం దళిత కుటుంబాలకు అందజేస్తున్న దళిత బంధు పేద దళిత కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండలం లోని కొత్తపేట పంచాయితీ పరిధిలో ఇల్లందు-మహబూబాబాద్ ప్రధాన ర హదారి పై దళితుల కుటుంబాలు, నాయకులు, మహిళలు దర్నా నిర్వహించా రు. దళితులు రోడ్డు పై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఉపేందర్ తన సిబ్బందితో రావ డంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులతో మాట్లాడి ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్లియర్ చేశారు.ఈధర్నాకు న్యూడెమోక్రసీ నాయకులు గౌని ఐలయ్య, బండారు ఐలయ్య, నాగేశ్వరరావు, రాంబాబు, సైదులు సంఘీ భావం ప్రకటించి వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెర వేర్చలేదని, మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని, దళిత బం ధు పధకం పేరు చెప్పి దళితలలో ఉన్న వారికి, బిఆర్‌ఎస్ పార్టీల నాయకుల కు ఇచ్చకుంటున్నారని, రాష్ట్రంలో 17 లక్షల మంది దళితులు ఉన్నారన్నారు. దళిత బంధు పథకం నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గందంపల్లి, కొత్తపేట, సింగారం కాలనీలో సుమారుగా 150 దళిత కుటుం బాలు నివాసం ఉంటున్నారని తెలిపారు. దళితబంధులో రాజకీయ జోక్యం ఎక్కువుగా ఉన్నదని ఆరోపిసస్తూ తెలంగాణ ప్రభుత్వం పై స్థానిక ఎమ్మేల్యే పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబురావు, బాల రాజు, సురేష్ ఉపేందర్, రాము, యాకుబ్, శ్రీను, బుజ్జమ్మ, భారతమ్మ, అరు ణ, జయమ్మ , వినోధ, పద్మ, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.